- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jubilee Hills By-Election: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం!
జూబ్లీహిల్స్అసెంబ్లీ ఉపఎన్నికకు నేడు ఈసీ నోటిఫికేషన్విడుదల చేయనున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో/సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్అసెంబ్లీ ఉపఎన్నికకు నేడు ఈసీ నోటిఫికేషన్విడుదల చేయనున్నది. అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. దరఖాస్తుల దాఖలుకు 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జూబ్లీహిల్స్నియోజకవర్గంలో మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. నేడో, రేపు బీజేపీ సైతం క్యాండిడేట్‌ను ఖరారు చేయనున్నది.
మూడు పార్టీల పోరు
ఈ ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఆశపడుతుండగా.. ఎలాగైనా విజయం సాధించాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. మరోవైపు గెలుపు కోసం బీజేపీ సైతం తహతహలాడుతున్నది. దీపావళి తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనుంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇక్కడే మోహరించనున్నారు. జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగానే మాగంటి గోపినాథ్ భార్య సునీతకు టికెట్ కేటాయించింది. గోపినాథ్మీద సానుభూతితో విజయం సాధిస్తామని గులాబీ పార్టీ అంచానా వేస్తున్నది. మరోవైపు ప్రజల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదని అది కలసివస్తుందని భావిస్తున్నది. ఇప్పటికే ఇన్‌చార్జిలుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులను నియమించగా.. వారు డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
గెలుపుపై కాంగ్రెస్ ధీమా
జూబ్లీహిల్స్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నది. అందులో భాగంగానే అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్‌ను ప్రకటించింది. ఇన్‌చార్జిలుగా ముగ్గురు మంత్రులను సైతం నియమించింది. 20 మందికిపైగా కార్పొరేషన్ చైర్మన్లకు సైతం ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కేడర్‌ను అప్రమత్తం చేస్తున్నది. కాంగ్రెస్ ఎలాగైనా విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఓటింగ్‌లో ఎక్కువగా పాల్గొనే స్లమ్ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అదే సమయంలో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడేలా వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రస్ అభ్యర్థికి ఎంఐఎం మద్దతు ప్రకటించడంతో తమ గెలుపు సునాయసం అవుతుందని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీలో టిక్కెట్ ఆశించి భంగపడిన వారిని బుజ్జగించేందుకు చేపట్టిన కార్యక్రమం సైతం పూర్తయింది. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసేందుకు వ్యూహన్ని సిద్ధం చేశారు. ఈ సీటులో విజయం సాధించడం ద్వారా హైదరాబాద్జిల్లాలో బోణి చేసినట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్ఉపఎన్నికలో గెలుపొందని కాంగ్రెస్.. జూబ్లీహిల్స్‌లోనూ విజయం సాధించినతన బలాన్ని 66కు పెంచుకోవాలని చూస్తున్నది. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. దీపావళి తర్వాత మంత్రులు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు సైతం ప్రచారంలో పాల్గొననున్నారు.
నేడో, రేపో బీజేపీ అభ్యర్థి ప్రకటన
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ కొంత వెనకబడి ఉందనే చెప్పొచ్చు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుకు వెళ్తుండగా బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పరిధిలోనిది కావడంతో ఇతర నాయకులు ఇక్కడ జోక్యం చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఆసక్తి చూపడం లేదు. నేతలతో పాటు కేడర్ సైతం కొంత నిరుత్సాహంలో ఉంది. మాగంటి గోపినాథ్జూన్లో చనిపోతే ఇప్పటి వరకు అభ్యర్థి ఎంపిక మీద బీజేపీ అధిష్టానం ప్రాథమిక కసరత్తు సైతం పూర్తి చేయకపోవడాన్ని పార్టీ కేడర్ప్రశ్నిస్తున్నది.






