Jubilee Hills By-Election: మీరు స్పందించకపోతే కోర్టుకు పోతాం.. ఈసీకి కేటీఆర్ హెచ్చరిక

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

Jubilee Hills By-Election: మీరు స్పందించకపోతే కోర్టుకు పోతాం.. ఈసీకి కేటీఆర్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఓట్ చోరీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ‘చోరీ కా ఓట్’ జరుగుతోంది. ‘చోరీ కా ఓట్’పై స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీఈవోకు కంప్లైంట్ చేశాం. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 లక్షల 75 వేల ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 3 లక్షల 98 వేలు ఓట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతం కంటే ఇప్పుడు 23 వేల ఓట్లు పెరిగాయి అని అధికారులు చెప్తున్నారు. ఇంత తక్కువ సమయంలో 23 వేల ఓట్లు ఎలా పెరిగాయి అని మాకు అనుమానం వచ్చింది. సంస్కృతీ అవెన్యూ అపార్ట్మెంట్‌లో 43 దొంగ ఓట్లు ఉన్నాయి. బూత్ నెంబర్ 125లో 25 ఫేక్ ఓట్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ లిస్ట్ మొత్తం తప్పుల తడకగా ఉంది. కొత్తగా 12045 దొంగ ఓట్లు సృష్టించారు. విచారణ చేయాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తున్నాము. ఫేక్ ఓట్లను తొలగించకపోతే కోర్టుకు వెళ్తాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలవబోతోంది’’ అని కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు.

Next Story