కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిదర్శనం : మహేష్ కుమార్ గౌడ్

by Muthe.Rajitha |

కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిదర్శనం : మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, అందువల్లే ఈ గెలుపు సాధ్యం అయిందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు నిదర్శనం అని, కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన మహేష్ కుమార్ గౌడ్.. మరో 8 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలియజేసారు.

Next Story