జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ప్రకటించిన ఏఐసీసీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-08 17:12:06  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది.

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ప్రకటించిన ఏఐసీసీ
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయబోయే అభ్యర్థిని అధికార కాంగ్రెస్ ప్రకటించింది. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు తమవంతు ప్రయత్నాలు చేసినా.. నవీన్ యాదవ్ వైపే హైకమాండ్ మొగ్గుచూపింది. అయితే ఆశావహులను సీఎం రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడారని, పార్టీ తప్పకుండా మీకు సముచితమైన గౌరవాన్ని ఇస్తుందని, పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపునకు సహకరించాలని నచ్చచెప్పడంతో వారు పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో స్థానిక కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయింది. కాగా, నవంబరు 11న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన మాగంటి గోపీనాథ్‌ (62) మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.




Next Story