Jubilee Hills By-Election: జోరు పెంచిన కాంగ్రెస్.. మంత్రులకు కీలక బాధ్యతలు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) కోసం డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) బాధ్యతలు అప్పగించారు.

Jubilee Hills By-Election: జోరు పెంచిన కాంగ్రెస్.. మంత్రులకు కీలక బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) కోసం డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) బాధ్యతలు అప్పగించారు. రహమత్ నగర్ డివిజన్ బాధ్యతను కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి.. బోరబండ డివిజన్ బాధ్యతను సీతక్క, మల్లు రవికి.. వెంగల్ రావు నగర్ డివిజన్‌ బాధ్యతను తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి.. సోమాజిగూడ డివిజన్‌ బాధ్యతను శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కు.. షేక్ పేట డివిజన్‌ కొండా సురేఖ, వివేక్‌కు.. ఎర్రగడ్డ డివిజన్‌ దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావుకు.. యూసఫ్ గూడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లకు సీఎం రేవంత్‌ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక దశకు చేరుకున్నది. ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా ఇప్పటికే మంత్రులు ప్రచారంలో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్​యాదవ్​పైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తిప్పికొడుతూ ప్రజలకు వివరిస్తున్నారు.

Next Story