- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోరాహోరీగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తరపున సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy), బీఆర్ఎస్ అభ్యర్థి తరపున కేటీఆర్(KTR), బీజేపీ అభ్యర్థి తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. పాదయాత్రల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు, మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.






