ముగిసిన ‘జూబ్లీహిల్స్’ ప్రచారం.. ఆఖరి రోజు అదరగొట్టిన లీడర్లు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక(Jubilee Hills By Election) ప్రచార పర్వం ముగిసింది.

ముగిసిన ‘జూబ్లీహిల్స్’ ప్రచారం.. ఆఖరి రోజు అదరగొట్టిన లీడర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక(Jubilee Hills By Election) ప్రచారం ముగిసింది. సరిగ్గా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మైకులన్నీ మూగబోయాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ 11వ తేదీన, 14వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల పోటీలో మొత్తం 58మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. దాదాపు 17 రోజుల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కొనసాగింది. ఈ 17 రోజులు.. ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో ప్రధాన పార్టీల నాయకులు హోరెత్తించారు. 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఉండటంతో 48 గంటల ముందుగా ప్రచారాన్ని ఆపేశాయి. 14వ తేదీన ఎన్నికల కమిషన్ అధికారులు ఓట్లు లెక్కించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.92 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

Next Story