జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ఈసీ సీరియస్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-11 06:15:52  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ఈసీ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలోనే నాల్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్‌లకు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఈసీ ఫైర్ అయింది. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రామచంద్రూ నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు జారీ చేసింది.

Read More... ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు

Next Story