నేనే సీనియర్.. జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తా: అంజన్ కుమార్ యాదవ్ ప్రకటన

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) వేళ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు.

నేనే సీనియర్.. జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తా: అంజన్ కుమార్ యాదవ్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) వేళ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తా. నా సామాజికవర్గానికి న్యాయం చేయాలి. మాకు మంత్రి పదవి ఇవ్వాలి. పార్టీలో, సిటీలో నాకంటే సీనియర్ ఎవరూ లేరు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తా’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈనెలలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలో విజయం సాధించాలని తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అలాంటి వేళ.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story