జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-15 06:34:39  IST  )

జూబ్లీహిల్స్(Jubilee Hills By-Election) బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) నామినేషన్ దాఖలు చేశారు.

జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్(Jubilee Hills By-Election) బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం షేక్‌పేట్ తహసీల్దార్ ఆఫీస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సహా పలువురు ముఖ్య నేతలతో వెళ్లి తొలి సెట్ నామినేషన్ చేశారు. కాగా, ఈ ఉపఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈనెల 21 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగనుంది. ఈనెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. వచ్చే నెల 11న పోలింగ్‌, 14న కౌంటింగ్‌ జరగనుంది. 16న ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది.

Read More: Gangula Kamalakar: జూబ్లీహిల్స్‌లో నిర్మాణానికి - విధ్వంసానికి మధ్య ఎన్నిక

Next Story