- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ క్షమాపణలు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు తెలిపారు. కాగా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన 'వార్-2' ప్రీ రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుక అనంతరం తారక్ ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేసారు. తాను ఇందాక స్పీచ్ లో ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, తనను క్షమించాలి అని కోరారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత గొప్పగా, సజావుగా జరగడానికి సహాకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఎంతో బాధ్యత తీసుకొని తన ఫ్యాన్స్ ఆనందానికి కారణం అయ్యారని ప్రభుత్వాన్ని తారక్ కొనియాడారు.
సెట్‌లో తారక్‌ను చూసి చాలా నేర్చుకున్నా..హృతిక్ రోషన్ షాకింగ్ కామెంట్స్






