- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T-బీజేపీ చీఫ్ బండి సంజయ్, డీకే అరుణకు జేపీ నడ్డా ప్రశంసలు
by Satheesh |
రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, రోజురోజుకూ జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలపై తెలంగాణ బీజేపీ ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ పేరిట దీక్ష చేపట్టింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, రోజురోజుకూ జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలపై తెలంగాణ బీజేపీ ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ పేరిట దీక్ష చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలు చేపడుతున్న ఈ దీక్షపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. దీక్ష సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. ఈ నిర్ణయం ఎంతో అభినందనీయమని నడ్డా కొనియాడారు. మహిళా సమస్యలపై పోరాడుతున్న తీరు భేష్ అంటూ జేపీ నడ్డా కితాబిచ్చారు. తెలంగాణ మహిళలకు బీజేపీ జాతీయ నాయకత్వం అండగా ఉందనే భరోసా ఇవ్వాలని బండి, డీకే అరుణకు నడ్డా సూచించారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం మరింతగా పోరాడాలని నేతలకు సూచించారు.
Next Story






