‘దారి మళ్లకుండా చూడండి’.. కేంద్రమంత్రి నడ్డా ఆదేశాలు

by Gantepaka Srikanth |

తెలంగాణకు యూరియా సరఫరాపై కేంద్రమంత్రి జేపీ నడ్డా(JP Nadda) ఆదేశాలు జారీ చేశారు.

‘దారి మళ్లకుండా చూడండి’.. కేంద్రమంత్రి నడ్డా ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు యూరియా సరఫరాపై కేంద్రమంత్రి జేపీ నడ్డా(JP Nadda) ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో యూరియా దారిమళ్లద్దొని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విజ్ఞప్తి మేరకు యూరియా సరఫరాపై అధికారులకు నడ్డా ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఇటీవల రెండ్రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి యూరియా(Urea) కోటా పెంచాలని ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి జహీరాబాద్‌ పారిశ్రామిక స్మార్ట్‌ సిటీ, వరంగల్‌ విమానాశ్రయానికి ఆర్థిక సాయం, హైదరాబాద్‌-విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, హైదరాబాద్‌-బెంగళూరు మధ్య తలపెట్టిన పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్‌ కారిడార్‌గా అభివృద్ధి చేయడంపై చర్చించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆ సమస్య గురించి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి వివరించారు. సీఎం రేవంత్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న నడ్డా బుధవారం అధికారులకు ఆదేశాలిచ్చారు.

Next Story