TWJF : కార్మికుల సమ్మెకు జర్నలిస్ట్ సంఘాల మద్ధతు

by Muthe.Rajitha |

దేశవ్యాప్తంగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె(Strike) పిలుపునకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర కమిటీ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది.

TWJF : కార్మికుల సమ్మెకు జర్నలిస్ట్ సంఘాల మద్ధతు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె(Strike) పిలుపునకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర కమిటీ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపుల చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు తెలియజేసింది. సమ్మెలో జర్నలిస్టులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా శాఖలు జూలై 9న బుధవారం అన్ని జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్లో కేంద్ర కార్మిక సంఘాలతో పాటు జరిగే ఆందోళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.

కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించే ధర్నాలు, ప్రదర్శనలు ఇతర ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వాములం కావడం ద్వారా కార్మికుల ఐక్యతను ప్రదర్శించాలని సూచించింది. జర్నలిస్టులకున్న వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపు చట్టాల పునరుద్ధరణతో జర్నలిస్టు వృత్తి ప్రమాణాలను కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా నిరసన చెప్పాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Next Story