బిగ్ బ్రేకింగ్: జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అరెస్ట్

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి పోలీసులు తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ కేసులో అరెస్ట్ చేశారన్నది మాత్రం స్పష్టం చెయ్యలేదు. బోడుప్పల్ రాఘవేంద్ర కాలనీలో ఉన్న క్యూ న్యూస్ ఆఫీస్‌పై మంగళవారం రాత్రి దాదాపు ఇరవై మంది పోలీసులు దాడి చేశారు. అనంతరం మల్లన్నను అదుపులోకి తీసుకొని కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: ఈడీ కార్యాలయం నుండి బయటకు వచ్చిన కవిత.. నేరుగా అక్కడికే పయనం

ఆంధ్రోడి చేతిలో TSPSC తాళాల గుత్తి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Next Story

Most Viewed