మున్సిపల్ IT సేవల కోసం జాయింట్ కమిటీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

by Kema Shiva Kumar |

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ఐటీ ఆధారిత పరిపాలనను సమన్వయం చేయడానికి జాయింట్ కమిటీ ఏర్పాటైంది.

మున్సిపల్ IT సేవల కోసం జాయింట్ కమిటీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోని జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో ఐటీ నిర్వహణ, ఐటీ ఆధారిత పరిపాలన వ్యవహారాలను సమన్వయం చేయడానికి మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ సీఎస్ అధ్యక్షతన జాయింట్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉండడంతోపాటు, కమిటీ కన్వీనర్లుగా మూడు కార్పొరేషన్లకు సంబంధించిన అడిషనల్ కమిషనర్లు (ఐటీ) వ్యవహరించనున్నారు. ఈ కమిటీ మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఐటీ ఆధారిత సేవలను పర్యవేక్షించడంతోపాటు కామన్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించనుంది.

Next Story