బీజేపీలో చేరిక.. చీకోటి ప్రవీణ్ క్లారిటీ ఇదే! (వీడియో)

by Sathputhe Rajesh |

క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీలో చేరిక.. చీకోటి ప్రవీణ్ క్లారిటీ ఇదే! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిందుత్వ గురించి మాట్లాడితే కొంత మంది బీజేపీలో చేరబోతున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారని, ఈడీ రెయిడ్‌లు చేయించి బీజేపీలో చేరేటట్లు ఆ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

అలాంటి వారికి ఒకటే సమాధానం చెబుతున్నాను. హిందుత్వం అనేది నా రక్తంలోనే ఉంది. హిందువుగా పుట్టాను. హిందువుగానే చస్తాను అన్నారు. ఒక వేళ పొలిటికల్‌గా స్టాండ్ తీసుకోవాల్సి వస్తే బీజేపీ వైపు స్టాండ్ తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల ఆయన హిందుత్వ గురించి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్న నేపథ్యంలో బీజేపీలో చేరే విషయంలో సానుకూల వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతున్నాయి.

కాగా చీకోటి ప్రవీణ్ కారు చోరీకి గురైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ నా కారు చోరీ సాధారణ దొంగతనం కాదన్నారు. తనకు క్యాసినో ఇండస్ట్రీలోని ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేశారు. గత కొంత కాలంగా తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారని నేను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిసి టార్గెట్ చేశారని అన్నారు. ఈడీ విచారణ మొదలైనప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులు విచారణ జరిపి తనకు సెక్యూరిటీ పెంచాలని కోరారు.

Next Story