- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fake Job Scam : తెలంగాణ సచివాలయంలో జాబ్స్ అంటూ వల! నిరుద్యోగులకు తెలంగాణ పోలీస్ అలర్ట్
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ నిరుద్యోగి నుంచి రూ. 2.34 లక్షలు దండుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ నిరుద్యోగి నుంచి రూ. 2.34 లక్షలు దండుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్ శాఖ గురువారం ట్విట్టర్ వేదికగా నిరుద్యోగులను అలర్ట్ చేసింది.హైదరాబాద్‌లోని అంబేడ్కర్ సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ కొందరు అగంతకులు అమాయక నిరుద్యోగులకు వల వేస్తున్నారని తెలిపింది.
ఫలానా శాఖలో పనిచేస్తున్నానంటూ నమ్మించి ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇలాంటివి అస్సలు నమ్మోద్దని పేర్కొంది. పైరవీలతో ప్రభుత్వ ఉద్యోగం రాదనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తుంచుకోవాలని సూచించింది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే నియామక నోటిఫికేషన్లతోనే ఖాళీలు భర్తీ అవుతాయని, మోసగాళ్ల వలలో పడొద్దని తెలిపింది.
Next Story






