- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన విజయం తెలుగువారికి గర్వకారణం అవుతుంది.. ఉపరాష్ట్రపతి అభ్యర్థితో జితేందర్ రెడ్డి భేటీ
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి అన్ని పార్టీల ఎంపీలు మద్దతు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు ఏ.పీ. జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో / డైనమిక్ బ్యూరో: త్వరలో జరగబోయే (Vice President) ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy)కి అన్ని పార్టీల ఎంపీలు మద్దతు ఇవ్వాలని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు ఏ.పీ. జితేందర్ రెడ్డి (AP Jitender Reddy) పిలుపునిచ్చారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆయన, ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశ సమగ్రత, రాజ్యాంగ విలువలకు అచంచలంగా కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. న్యాయరంగంలో ఆయన ఇచ్చిన కీలక తీర్పులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చూపిన తపన, రాజ్యాంగ స్ఫూర్తి పట్ల ఆయన నిబద్ధత అందరికీ ఆదర్శమని అన్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఇది తెలుగువారి ప్రతిష్టను దేశ రాజధానిలో పెంచే చారిత్రక అవకాశం అని అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయం సాధిస్తే, ఢిల్లీలో తెలుగు ప్రజల గౌరవం, ప్రతిష్ట మరింత పెరుగుతుందని, తెలుగు ఎంపీలందరూ ఆయనకే మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిష్పాక్షిక దృక్పథం, న్యాయశాస్త్రంలో అపారమైన అనుభవం, రాజ్యాంగం పట్ల అచంచలమైన నిబద్ధతతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవికి గౌరవాన్ని తీసుకువస్తారని చెప్పారు. ఆయన విజయం తెలుగువారికి గర్వకారణం అవుతుందని పేర్కొన్నారు. ఈ భేటీలో జితేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మల్లు రవి తదితరులు ఉన్నారు.






