- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భట్టి విక్రమార్కను వదిలిపెట్టం... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఫైర్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీపీఎం కలిసి ఎక్కువ స్థానాలు గెలవడం జీర్ణించుకోలేకనే భట్టి విక్రమార్క సీపీఎం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీపీఎం కలిసి ఎక్కువ స్థానాలు గెలవడం జీర్ణించుకోలేకనే భట్టి విక్రమార్క సీపీఎం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని అన్నారు. తన ఉనికి తగ్గిపోతుందని, బలం తగ్గిపోతుందని ఆయన భయపడుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశమే లేదని సీపీఎం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మధిర నియోజకవర్గంలో 15మంది జైలుకు పంపించారని విమర్శించారు.
రామారావు హత్య జరిగిన పాపర్లపాడులో కాంగ్రెస్ వాళ్లే దౌర్జన్యం చేసినా 25మంది సీపీఎం కార్యకర్తలపై కేసులు పెట్టారని విమర్శించారు. ఇతర గ్రామాల్లోనూ సీపీఎం నాయకులు గాయాలపాలైతే వారి మీదనే కేసులు పెడుతున్నారని చెప్పారు. పేదలు, అనగారినవర్గాల ప్రజలు ఎవరిపై దాడి జరిగి తెగించి కొడ్లాడుతున్న సీపీఎం నాయకులపైనే అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి కేసులతో సీపీఎం నాయకులను అడ్డుకుంటామని భట్టి విక్రమార్క భావిస్తే అది తన జీవితంలో జరగదని హెచ్చరించారు.






