- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జార్ఖండ్ స్వరాష్ట్ర ఉద్యమం తెలంగాణకు స్ఫూర్తి.. శిబూ సోరెన్ మరణం పట్ల కేసీఆర్ సంతాపం
జార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇవాళ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మృతి పట్ల ఆయన సంతాపం ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంతీయ అస్తిత్వం కోసం శిబూ సోరెన్ చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగపడ్డాయని కామెంట్ చేశారు. శిబూ సోరెన్ మరణం దేశ అస్తిత్వ జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన అందించిన సహకారాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) స్థాపన సమయంలో శిబూ సోరెన్‌ను హైదరాబాద్‌లో జరిగిన తొలి సభకు మొదటి అతిథిగా ఆహ్వానించుకున్నామని గుర్తు చేశారు.
నాటి తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ తెలిపిన సంపూర్ణ సంఘీభావం మర్చిపోలేనిదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన ఆయన తాను ప్రారంభించిన మలిదశ ఉద్యమానికి అండగా నిలిచారని తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా తమకు దన్నుగా నిలబడ్డారని పేర్కొన్నారు. జార్ఖండ్, తెలంగాణ ప్రజా ఉద్యమ విజయాలు.. దేశ ఫెడరల్ స్ఫూర్తికి, ప్రాంతీయ, సామాజిక న్యాయానికి దిక్సూచిగా నిలిచాయని తెలిపారు. శిబూ సోరెన్ జేఎంఎం పార్టీ, తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒత్తిడి తేవడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతర కాలంలో 2022లో జార్ఖండ్‌లో శిబూ సోరెన్ గారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దుఃఖ సంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు, కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






