- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jeevan Reddy: ఆ విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం.. సీఎం కు జీవన్ రెడ్డి లేఖ
మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కూలి రేటు రూ. 400లకు పెంచటంతోపాటు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా ప్రత్యేకంగా వేసవి భత్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy) మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి (Jeevan Reddy) విజ్ఞప్తి చేశారు. వేసవి భత్యం మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలలకు గాను 30 శాతం కల్పించాల్సి ఉన్నప్పటికీ ఈ విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. తెలంగాణలో ఉపాధి హామీ కూలీలకు (NREGS) గతేడాది కూలి రేటు రూ. 300 చెల్లించగా, ఈ ఏడాది కేవలం రూ. 7 పెంచి, ప్రస్తుతం రూ. 307 మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు. వేసవిలో చెల్లించే కరువు భత్యం (Summer Allowance) సైతం చెల్లించకపోవడంతో ఉపాధీ హామీ కూలీలు చాలీచాలని వేతనంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కూలీలకు రోజువారి కూలి రేటు రూ.400 చెల్లిస్తున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణలోనూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.






