ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నడ మంత్రపులో వచ్చి బెదిరెంచే వాళ్ళు మోపయ్యారని మండిపడ్డారు.

MLC Jeevan Reddy Criticizes Komatireddy Rajagopal Reddy
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నడ మంత్రపులో వచ్చి బెదిరెంచే వాళ్ళు మోపయ్యారని మండిపడ్డారు. నా వద్దకు రాకుంటే మీరు చేసిన పనులకు బిల్లులు రావు, పనులు మంజూరు కావు అని చెప్పేవాళ్ళు ఉన్నారని ఆరోపించారు. పంచాయితీలకు నిధులు నేరుగా ఢిల్లీ నుండే వస్తాయని ఎవరిదగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయను, గ్రామాన్ని అభివృద్ధి కానివ్వను అనే వారు ఉన్నారని చెప్పారు.

పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఏమైనా అభివృద్ధి చేశారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చాకే అభివృద్ధి జరుగుతోందన్నారు. వాళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పెద్దరికం చేస్తున్నాడని మండిపడ్డారు. కాళ్లళ్లో కట్టబెడితే మర్యాద ఉండదని విమర్శించారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి తాను అండగా ఉంటానని చెప్పారు. దుబ్బగూడెెంలో నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Next Story