Japan Tour: జపాన్‌లో సీఎం రేవంత్ బృందం నాలుగో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-19 04:36:44  IST  )

తెలంగాణ (Telangana)రాష్ట్రాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలపాలనే ధ్యేయం, భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం (Telangana Rising Delegation) జపాన్ (Japan) పర్యటన సక్సెస్‌‌ఫుల్‌గా కొనసాగుతోంది.

Japan Tour: జపాన్‌లో సీఎం రేవంత్ బృందం నాలుగో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)రాష్ట్రాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలపాలనే ధ్యేయం, భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం (Telangana Rising Delegation) జపాన్ (Japan) పర్యటన సక్సెస్‌‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇవాళ నాలుగో రోజులో భాగంగా మౌంటి ఫుజి (Mount Fuji) ప్రాంతాన్ని సీఎం రేవంత్ బృందం సందర్శించనుంది. మౌంట్ ఫుజి చుట్టూ ఐదు సరస్సులు ఉండటంతో ఆప్రాంతం ఎకో పార్కులకు పెట్టింది పేరు. ఈ క్రమంలోనే అక్కడ ఫేమస్ అయిన అరకురయా పార్కు (Arakuraya Park)లో వివిధ రకాల వృక్షాలు, జంతువులను సీఎం రేవంత్ బృందం సదర్శించనుంది. వాటికి అక్కడికి ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలను టీమ్ పరిశీలించనుంది.

కాగా, మూడో రోజు సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ బృందం (Telangana Rising Team) శుక్రవారం భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకుంది. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్ (Digital Transformation), ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్‌టీటీ డేటా (NTT Data), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫస్ట్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫాం సంస్థ నెయిసా నెట్‌వర్క్స్‌ (Neisa Networks) సంయుక్తంగా హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. తెలంగాణ సర్కార్‌తో కలిసి దాదాపు రూ.10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు ఎంవోయూకు కూడా కుదుర్చుకున్నాయి.

Next Story