Janasena: మళ్లీ రిపీట్ అయితే బట్టలిప్పి కొడుతాం.. ఎమ్మెల్యే అనిరుధ్‍రెడ్డికి జనసేన వార్నిగ్

by Prasad Jukanti |

తెలంగాణలో జనసేన వర్సెస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ సంచలనంగా మారింది.

Janasena: మళ్లీ రిపీట్ అయితే బట్టలిప్పి కొడుతాం.. ఎమ్మెల్యే అనిరుధ్‍రెడ్డికి జనసేన వార్నిగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాలిటిక్స్ లో కాంగ్రెస్ వర్సెస్ జనసేన మధ్య డైలాగ్ వార్ రసవత్తరంగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‍ను కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‍పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా జనసేన నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం జనసేన పోటీలో ఉంటే మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇవాళ అనిరుధ్ రెడ్డిపై జనసేన పార్టీ నేతలతో కలిసి ఆ పార్టీన నేత సంపత్ నాయక్ ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.

బట్టలిప్పి కొడతాం:

పవన్ కల్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనిరుధ్ రెడ్డి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆయన బట్టలిప్పి కొడతామని ఈ సందర్భంగా సంపత్ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంటే ఎందుకు పోటీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తున్న వారికి సిగ్గుం? అని సంపత్ నాయక్ నిలదీశారు. జనసేన తరఫున పోటీ చేస్తున్నది బడుగు బలహీన వర్గాలు, గిరిజన బిడ్డలేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనిరుధ్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ ఎక్కడా కనిపించలేదని ఆ సమయంలో అనిరుధ్ రెడ్డి ఏడున్నావ్ రా బై అంటూ ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. మాలాంటి పేదలకు సీట్లిచ్చిన పవన్ కల్యాణ్ పై అవాకులు చెవాకులు పేలితే బాగుండదన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story