- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మల్ జిల్లాలో మొదలైన జనహిత పాదయాత్ర
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర(Janahitha Padayatra) నిర్మల్ జిల్లాకు చేరుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర(Janahitha Padayatra) నిర్మల్ జిల్లాకు చేరుకుంది. నిర్మల్ లోని ఖానాపూర్(Khanapur)లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనహిత పాదయాత్రలో ఏఐసీసీ జాతీయ కార్యదర్శి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో సహా పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, ఆర్థిక అవకతవకలను ఎండగడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగుతోంది.
ఖానాపూర్‌లో జరుగుతున్న ఈ యాత్రకు స్థానిక ప్రజల నుండి గణనీయమైన ఆదరణను లభిస్తోంది. ఇందులో రైతులు, మహిళలు, యువత, గిరిజన సంఘాలు నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర మొదటి విడతలో ఇదే చివరి పాదయాత్ర. బీసీ రిజర్వేషన్ల అంశంపై రేపటి నుంచి కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడంతోపాటు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. త్వరలోనే రెండవ విడత జనహిత పాదయాత్ర వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.






