- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్వాల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్.. జనసేనలో చేరిన కీలక నేతలు
గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీకి బలం పెరుగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: గద్వాల్ జిల్లా(Gadwal District) అల్లంపూర్ నియోజకవర్గం(Allampur Constituency)లో బీఆర్ఎస్(Brs)కు బిగ్ షాక్ తగిలింది. జనసేన(Janasena) తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆ పార్టీలో బి.ఆర్.ఎస్ నాయకులు చేరారు. గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని బి.ఆర్.ఎస్ యువజన నాయకుడు బోయా మహేష్ నాయుడుతో పాటు ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, తదితరులకు శంకర్ గౌడ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు. పవన్ కల్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ల వంటివని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంపై పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. తెలంగాణ జనసేన కార్యకర్తల అభిప్రాయాల మేరకు, పవన్ కల్యాణ్ ఆదేశాలతో తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని శంకర్ గౌడ్ తెలిపారు.






