- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలికను వేధించిన యువకునికి జైలు శిక్ష
ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించిన యువకుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఎల్బీనగర్ స్పెషల్ పోస్కో కోర్టు గురువారం తీర్పు చెప్పింది.

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించిన యువకుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఎల్బీనగర్ స్పెషల్ పోస్కో కోర్టు గురువారం తీర్పు చెప్పింది. మేడ్చల్ జిల్లాకు చెందిన కొండం ప్రేమ్ కుమార్ ఎల్బీ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. 2017, అక్టోబర్ 14న బాధితురాలి ఇంటికి వచ్చి తన ప్రేమను ఒప్పుకోవాలని ఒత్తిడి చెయ్యటంతోపాటు ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. మాట వినకపోతే ఫోటోలు ఫేస్ బుక్, యూ ట్యూబ్‌లలో అప్లోడ్ చేస్తానని వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా బెదిరించాడు. ఈ మేరకు ఫిర్యాదు అందగా ప్రస్తుతం నకిరేకల్ సీఐగా ఉన్న నాగరాజు కేసు నమోదు చేశారు. విచారణ జరిపి కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించారు. అదనపు పీపీలు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో జడ్జి నిందితుడు ప్రేమ్ కుమార్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.16 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.






