Jai Hind Rally : రేపు బాచుపల్లిలో జైహింద్ ర్యాలీ.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

రేపు హైదరాబాద్‌(Hyderabad)లోని బాచుపల్లిలో "జై హింద్ యాత్ర, సభ"(JaiHind Rally) జరగనుంది.

Jai Hind Rally : రేపు బాచుపల్లిలో జైహింద్ ర్యాలీ.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : రేపు హైదరాబాద్‌(Hyderabad)లోని బాచుపల్లిలో "జై హింద్ యాత్ర, సభ"(JaiHind Rally) జరగనుంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొననున్నారు. ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)ను రాజకీయంగా వాడుకుంటున్న బీజేపీ(BJP)ని ఎండగట్టడం, భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ(Bharat-Pak Ceasefire)పై ట్రంప్ వ్యాఖ్యలకు మౌనంగా ఉన్న ప్రధాని మోడీ(PM Modi) తీరును విమర్శించడం, సైనికులకు సంఘీభావం తెలపడమే లక్ష్యంగా ఏఐసీసీ(AICC) ఇచ్చిన పిలుపు మేరకు ఈ యాత్ర, సభను నిర్వహిస్తునారు. కాగా ఈ యాత్ర మధ్యాహ్నం 2 గంటలకు VNR కాలేజీ నుంచి KGR కన్వెన్షన్ వరకు జరుగనుంది.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నిజాంపేట్-బాచుపల్లి రోడ్డులోని KGR కన్వెన్షన్‌లో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఎక్స్-సర్వీస్ మెన్ కమిటీ ఛైర్మన్ కల్నల్ రోహిత్ చౌదరి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని టీపీసీసీ ఓ ప్రకటనలో కోరింది.

Next Story