‘MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలి’

by Disha Web Desk 2 |
‘MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుదాకర్ గౌడ్‌పై హత్యాయత్నం చేస్తానని బెదిరించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్డర్ వట్టికోట రామారావు గౌడ్ డిమాండ్ చేశారు. ఓయూలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రకులాలు డబ్బు, అధికార మధంతో బడుగు బలహీన వర్గాల నేతలను టార్గెట్ చేసి, చంపుతామని బెదిరించి, రాజకీయంగా ఎదగకుండా తొక్కెస్తున్నారని అన్నారు. ఒక బాధ్యతాయుత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వ్యక్తికి చట్టాలు, రాజ్యాంగం అంటే గౌరవం లేకపోవడం, నేర పూరిత చర్యలకు పాల్పడటాన్ని ఖండిస్తున్నామని అన్నారు.

కోమటిరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. చెరుకు సుథాకర్ గౌడ్‌కు కట్టుదిట్టమైన ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా కోమటిరెడ్డి లాంటి విషపురులను సస్పెండ్ చేయాలని, అప్పుడే గౌడులు, బలహీన వర్గాలు కాంగ్రెస్ కు అండగా ఉంటారని వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయకపోతే గాంధీభవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు మల్లేష్, జై గౌడ్ ఉద్యమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మగాని శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, వీరేందర్ గౌడ్, రాజా గౌడ్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed