- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌశిక్ రెడ్డితో గొడవ.. MLA సంజయ్ కుమార్ సంచలన నిర్ణయం
కరీంనగర్ కలెక్టరేట్(Karimnagar Collectorate) ఘటనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Sanjay Kumar) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ కలెక్టరేట్(Karimnagar Collectorate) ఘటనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Sanjay Kumar) స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నన్ను ఏ పార్టీ అని అడిగే హక్కు కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి లేదని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. త్వరలో కాంగ్రెస్(Telangana Congress) సభ్యత్వం కూడా తీసుకుంటా అని సంచలన ప్రకటన చేశారు. అనేక పార్టీలు మారి చివరకు బీఆర్ఎస్‌కు వచ్చిన నేతలకు తనను ప్రశ్నించే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, కమ్యూనిస్టు నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు బీఆర్ఎస్‌లో చేరకముందే పదవులు ఇచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి వచ్చిన వారు అనేకమంది మంత్రులు అయ్యారని గుర్తుచేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని ఫైర్ అయ్యారు. కేసీఆరే ఫిరాయింపులను ప్రారంభించి, ప్రోత్సహించారని అన్నారు. కౌశిక్ రెడ్డి తనపై చేయి చేసుకోలేదని స్పష్టం చేశారు.
కాగా, కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్‌లో ఆదివారం (జనవరి 12న) నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమక్షంలోనే ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కౌశిక్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాగ్వాదంతో పాటు ఒకరినొకరు తోసుకోవడం కలకలం రేపింది. పోలీసులు జోక్యం చేసుకుని హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.






