హథీరాం బాబా మఠాన్ని కూల్చకండి.. ఏపీ ప్రభుత్వానికి జాగృతి అధ్యక్షురాలు కవిత విజ్ఞప్తి

by Ramesh Naini |

హథీరాం బాబా మఠాన్ని కూల్చకుండా అభివృద్ధి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

హథీరాం బాబా మఠాన్ని కూల్చకండి.. ఏపీ ప్రభుత్వానికి జాగృతి అధ్యక్షురాలు కవిత విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంజారాల ఆరాధ్య దైవం అయిన (Hathiram Baba Math) హథీరాం బాబా మఠాన్ని కూల్చకుండా.. మఠాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం తిరుమలలోని హథీరాం బాబా మఠాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన సన్యాసులు, సద్గురువులతో ఆమె సమావేశమయ్యారు.

మఠంలో దక్షిణ భారత సాంప్రదాయాలను కాపాడాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా కవిత ప్రస్తావించారు. ఈ దిశలో తెలంగాణ జాగృతి తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. తిరుమలకి వచ్చే బంజారా భక్తుల కోసం ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు. అలాగే హథీరాం మఠాన్ని కూల్చకుండా, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధునీకరించి, బంజారాల సాంస్కృతిక వేదికగా అభివృద్ధి చేయాలని సూచించారు. దేశానికి సన్యాసులు, సద్గురువులు సాంస్కృతిక సంపద అని, వారికి గౌరవం ఇవ్వడం మన బాధ్యత అని కవిత తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి వారి ఆశీస్సులు అత్యంత అవసరమన్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి..

Next Story