- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత నిరాహార దీక్ష
ఖమ్మంలో నిన్న హైడ్రామా అనంతరం కవితను అరెస్ట్ చేసిన పోలీసులు కొద్దిసేపటిక్రితమే ఆమెను హైదరాబాద్ కు తరలించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం నగర శివారు ప్రాంతమైన వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. గత అర్థరాత్రి హైడ్రామా నడుమ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులతో తన దీక్షను ఆపలేరని కవిత స్పష్టం చేశారు. ఖమ్మం అంబేద్కర్ భవన్ వద్ద నిన్న రాత్రి ఆమె దీక్షకు దిగగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆమె దీక్షను భగ్నం చేసి హైదరాబాద్ కు తరలించారు. నేడు ఉదయానికి హైదరాబాద్ లో ఉన్న జాగృతి కార్యాలయానికి చేరుకున్న కవిత.. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తన దీక్షను అక్కడే కొనసాగించనున్నట్లు తెలిపారు. బాధితుల ఇళ్లు కూల్చిన ప్రభుత్వమే.. వారికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇళ్లను కూల్చినచోటే తిరిగి వాటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూదాన్ నివాసితులకు న్యాయం చేసేంతవరకూ తన పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.
భూదాన్ భూములంటేనే పేదలకు ఇచ్చిన భూములని ఆమె పేర్కొన్నారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతిస్తామని, వారికి మద్దతుగానే దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. నిన్న (సోమవారం) మధ్యాహ్నం నుంచి తమ దీక్ష కొనసాగుతూనే ఉందన్నారు. 31 ఎకరాల పేదల భూమిని పెద్దవారికి ముట్టజెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వాపోయారు. భూదాన్ భూముల్లోనే బాధితులకు డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో పేరుకు ముగ్గురు మంత్రులు ఉన్నా అక్కడి బాధితుల పరిస్థితి దారుణంగా తయారైందని అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వెలుగుమట్లలో ఏం జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ రాహుల్ కు బహిరంగ లేఖ రాస్తున్నట్లు కవిత తెలిపారు.






