Jaggareddy: అలాంటి సైకోలకు సజ్జనారే కరెక్ట్.. ఎన్‍కౌంటర్లపై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

సమాజంలో మహిళలు, యువతులను బ్లాక్ మెయిల్ చేసే సైకోల విషయంలో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Jaggareddy: అలాంటి సైకోలకు సజ్జనారే కరెక్ట్.. ఎన్‍కౌంటర్లపై  జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీసుస్టేషన్‍కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే వారి ఇంటికే వెళ్లి కేసు నమోదు చేయాలని పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు లాంటి నిర్ణయాలు మంచివని చెప్పారు. కొంత మంది సైకోగాళ్లు మహిళలలను ట్రాప్ చేసి వారి మహిళలు, యువతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అలాంటి వారికి సజ్జనార్ కరెక్ట్ అన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి... సమాజంలో ఎన్ కౌంటర్ వంటి భయం కూడా ఉండాలన్నారు.వైఎస్సార్ హాయంలో వరంగంలో ఓ అమ్మాయిని వేధించినందుకు ఓ ఎన్ కౌంటర్ చేశారు. బీఆర్ఎస్ హాయంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్లను రాజ్యంగ పరంగా సమర్ధించలేం. కానీ ఆడబిల్ల తండ్రిగా, కుటుంబాలు కలిగిన వారు సమర్ధిస్తారని ఇది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. బాధిత మహిళలు, యువతులకు భరోసా ఇచ్చేలా పోలీసుల చర్య ఉండాలన్నారు.

అలాంటి భయం ఉండాలి:

కొంతమంది ఆడపిల్లలతో ఫోటోలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. అలాంటి ఫోటోలు, ఆడపిల్ల తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదును బహిర్గతం చేయవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సంచారం బహిర్గతం చేస్తే ప్రైవసీ దెబ్బతీస్తుందని తద్వారా బాధితులు తమ జీవితం బలి తీసుకునే ప్రమాదం ఉంటుందన్నారు. ట్రాప్ అయిన అమ్మాయికి సమస్య కాకుండా పోలీసులు చూడాలన్నారు. సెన్సిటివ్ విషయాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సంయమనం పాటించాలని నాయకులు, అధికారుల వ్యక్తిగత సంబంధాల వార్తలు వేయకుండా ఉండాలని ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రైవసీ, ఇష్టాయిష్టాలలో ఇంకొకరు వేలు పెట్టొద్దన్నారు. రాజకీయ నాయకుడిగా పోలీసులతో కోట్లాడతాను ఇది పొలిటికల్ గేమ్. పోలీస్, పాలిటిక్స్ ఎప్పుడూ ఉండేదే ఇది వేరన్నారు. సీఐడీ చారు సిన్హా ప్రకటన మహిళలు, ఆడపిల్లల తల్లిదండ్రులకు వెపన్ లాంటివన్నారు.

Next Story