కరెన్సీపై గాంధీ బొమ్మ తీసేందుకు కుట్ర

by Ajay Maddhiboyina |

రాహుల్ గాంధీ పైనే కాదు.. కరెన్సీ మీద గాంధీ బొమ్మ ఎప్పుడు తీయాలా..? అ

కరెన్సీపై గాంధీ బొమ్మ తీసేందుకు కుట్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీ పైనే కాదు.. కరెన్సీ మీద గాంధీ బొమ్మ ఎప్పుడు తీయాలా..? అన్న కుట్ర జరుగుతుందని టీపీసీసీ వర్కింగ్​ప్రెసిండెంట్​తుర్పు జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీతో రాజకీయంగా చాటుమాటుగా కేసీఆర్ కుటుంబ సంసారం చేస్తోందని ఆయన విమర్శించారు. కేసీఆర్.., హరీష్ రావులు.. ఇద్దరూ తోపులే అయితే, మెదక్ పార్లమెంట్లో బీజేపీ ఎలా గెలిచింది? అని ఘాటుగా వ్యాఖ్యనించారు. బుధవారం గాంధీ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై హరీష్ రావు చేస్తున్న​వ్యాఖ్యలపై మండిపడ్డారు. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆర్ఎస్ఎస్, బీజేపీ పుట్టిన తర్వాత ఆ పార్టీ ఆనాటి నుండి.. ఈనాటి వరకు రాహుల్ గాంధీ కుటుంబానికి బద్ధ శత్రువులే అని పేర్కొన్నారు. ఈ మాత్రం పరిజ్ఞానం కూడా లేదా హరీష్ నీకు లేదా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి లు సొంత కవిత్వం చెప్పడం లేదు అని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అన్నది గ్రహించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో షార్ట్ కట్ ఇంజనీర్లు నువ్వు.. మీ మామే కదా..? దుయ్యబట్టారు.

దొంగలు మీరే..పోలీసులు మీరే నా..? అని ఎద్దెవ చేశారు. బీజేపీ తో రాజకీయంగా చాటు మాటుగా సంసారం చేసింది కేసీఆర్ కుటుంబమే కదా..?, అందుకే గజ్వేల్ సభలో మోడీ ప్రేమ ఉంటే చాలు అన్నది కేసీఆరే కదా..? అని గుర్తు చేశారు. తెలంగాణా ఇచ్చే సమయంలో స్పీకర్ గా ఉన్న మీరా కుమార్ కు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయకుండా, బీజేపీ కి ఓటేసిన మీరా విలువల గురించి మాట్లాడేద అని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో నీళ్లు వచ్చేది వదిలేసి, లిఫ్ట్ లను పెట్టింది మీరు కదా? అని దుయ్యబట్టారు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా..? అని అన్నారు. తెలంగాణ లో బీఆర్ఎస్​అధికారంలోకి రాకున్నా ఫరవాలేదు, కానీ కాంగ్రెస్ రావద్దని ..బీజేపీ నీ ఎత్తేపనిలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు సూచనలు తుంగలో తొక్కింది కేసీఆర్ కాదా.? అని ప్రశ్నించారు. నకిలీ ప్లానింగ్.. తో తెలంగాణ ప్రజల సొమ్ము వృదా చేసింది మీరే కదా..? అని అన్నారు. మీ తప్పులు ప్రశ్నిస్తే.. సీఎం రేవంత్..ఉత్తమ్​కుమార్​రెడ్డి పై నిందలా..? అని వ్యాఖ్యనించారు. పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ నేతలు అంతా బీజేపీకి మద్దతిచ్చారని, పోలింగ్ బూతులో బీఆర్ఎస్ ఏజెంట్లు కూడా లేనిది నిజమే కదా..? అని జగ్గారెడ్డి ఈసందర్భంగా ప్రశ్నించారు.

Next Story