గాంధీ భవన్‌లో ఆసక్తికర దృశ్యం.. కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేకు జగ్గారెడ్డి పొలిటికల్ క్లాస్

by Prasad Jukanti |

గాంధీ భవన్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌కు జగ్గారెడ్డి కీలక సూచనలు చేశారు. రెండోసారి గెలిస్తేనే రాజకీయాల్లో నిలబడతారంటూ హితబోధ చేశారు.

గాంధీ భవన్‌లో ఆసక్తికర దృశ్యం.. కాంగ్రెస్ యువ  ఎమ్మెల్యేకు జగ్గారెడ్డి పొలిటికల్ క్లాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గాంధీ భవన్‍లో శనివారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో అత్యంత చిన్న వయసు కలిగిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక సూచన చేశారు. ఫస్ట్ టైమ్ గెలపును మరిచిపోవాలని సెకండ్ టైమ్ గెలిస్తేనే రాజకీయాల్లో నిలబడుతారంటూ హితబోత చేశారు. సెకండ్ టైం ఎమ్మెల్యేగా పోటీని ఫస్ట్ టైం ఎన్నికగా భావించి కసితో పనిచేయాలనని రెండో సారి గెలిస్తే అదే పెద్ద బ్రేక్ అన్నారు. రాజకీయాల్లో భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని సూచించారు. ఇవాళ ఉదయం గాంధీ భవన్‍ లో జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ తారసపడ్డారు. ఈ సందర్భంగా సరదాగా ముచ్చటించిన జగ్గారెడ్డి ఈ సూచన చేశారు. కాగా ఈ సందర్భంగా ఓ రోజు మా ఇంటికి రావాలని జగ్గారెడ్డిని ఎమ్మెల్యే రోహిత్ ఆహ్వానించారు. జగ్గారెడ్డి చెప్పిన రాజకీయ పాఠాలను మైనంపల్లి రోహిత్ ఏ మేరకు ఆచరణలో పెడతారో చూడాలి మరి.

Next Story