- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పటికి ఇంకా మోడీ, అమిత్ షా పుట్టనేలేదు.. బీజేపీపై జగ్గారెడ్డి పైర్
ప్రజాసమస్యలను పక్కన పెట్టి గాంధీ, నెహ్రూలను టార్గెట్ చేస్తారా అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలకు మేలు చేస్తారని బీజేపీకి ప్రజలు మూడు సార్లు పట్టం కడితే నరేంద్ర మోడీ, అమిత్ షా మాత్రం గాంధీ, నెహ్రూలను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ, నెహ్రూ మీకులా క్రిమినల్స్ కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి 1930లోనే గాంధీ 'రఘుపతి రాఘవ రాజారామ్ పతిత పావన సీతారామ్'అని సత్యాగ్రహం మొదలు పెట్టారని అన్నారు. ఆయన రాముడి గురించి చెప్పిన రోజు మోడీ, అమిత్ షాలు పుట్టలేదని అసలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ఎక్కడ ఉన్నాయని నిలదీశారు. గాంధీ, నెహ్రూల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు.
మోడీ ప్రభుత్వం రైతులు, యువతను పట్టించుకోవడం లేదని అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని చెప్పారు. నెహ్రూ, గాంధీపై కుట్రకు నిరసనగా సంగారెడ్డిలో లక్ష మందితో సభ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్‍లో ప్రజా సమస్యలపై చర్చించే పరిస్థితే లేదని మోడీ పాలనలో ప్రజల అవసరాలు, రైతులు, మహిళా, యువత ఉద్యోగాలపై చర్చ జరగడం లేదన్నారు. స్వాతంత్రం కోసం ఆస్తి, ప్రాణాలు దారాదత్తం చేసిన నెహ్రూను టార్గెట్ చేసి బీజేపీ పని చేస్తుందన్నారు. వందేమాతరంపై చర్చ లో ప్రియాంక గాంధీ ధీటుగా సమాధానం చెప్పారు. నెహ్రూ ఐపోయింది.. ఇప్పుడు మహాత్మా గాంధీ వరకు వచ్చారని మహాత్మా గాంధీ ఉన్నప్పుడు పుట్టని వాళ్ళు ఆయన మీద, నెహ్రూ మీద మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో దేశ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. 1930లోనే ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టిన మోడీ, అమిత్ షాలు మాట్లాడుతున్నారని మోడీ, అమిత్ షాలు నెహ్రూ, గాంధీనీ టార్గెట్ చేస్తూ రాజకీయాల్లో వీళ్ల పేర్లు వినపడకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్క రోజు జైల్లో ఉండాలి అంటేనే కాళ్ళు, చేతులు వణుకుతాయి. కానీ నెహ్రూ12 ఏళ్లు జైళ్లో ఉండి వచ్చాన్నారు. ఇంత స్వేచ్ఛగా మూడు సార్లు మోడీ ప్రధాని అయ్యావు అంటే అది గాంధీ కుటుంబం, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమేనన్నారు. బీజేపీ తెచ్చిన చట్టాలు, న్యాయ వ్యవస్థ తోనే దేశాన్ని ఏలుతున్నావు
అధికారం అందుకోసం ఇచ్చారా?
మోడీకి నెహ్రూ, గాంధీలను టార్గెట్ చేయండి అని ప్రజలు అధికారం ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలను ఏకం చేయడానికి గాంధీ రాముడి పేరు వాడారు. కానీ బీజేపీ దేశ ప్రజల్ని విభజించడం కోసం రాముడి పేరు వాడుతున్నారని ధ్వజమెత్తారు. రాముడి పేరుతో మూడో సారి అధికారంలోకి వచ్చారు మోడీ 15 లక్షలు పేదల అకౌంట్ లో వేస్తా అన్నారు వేశారా అని పర్శించారు. దీని మీద పార్లమెంట్‍లో మోడీ చర్చ పెట్టాడా? ప్రజలను ఏకం చేయడానికి గాంధీ రాముడి పేరు వాడారు. మహాత్మా గాంధీ ఐడియాలజీ మీదనే ప్రపంచం అంత నడుస్తుంటే బీజేపీ, ఆర్ఎస్ మాత్రం గాంధీ పేరు లేకుండా చేస్తున్నారు. రాహుల్ గాంధీ, నెహ్రూ, గాంధీ కుటుంబాలను టార్గెట్ చేయడమేనా..? బీజేపీస, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఏంటి? అని నిలదీశారు. 33 కోట్ల కుటుంబాలు 8 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీతో ఉపాధి పొందుతున్నారు. గాంధీ పేరు కూడా వినలేకపోతున్నారా? బీజేపీ నాయకులకు ఈర్ష్య అన్నారు.
భారత ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తారు. రాహుల్ ప్రధాని అయ్యాక మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు. ప్రధాని అయ్యాక రాహుల్ చెప్తే ఈడీ, సీబీఐ సంస్థలు వినవా? మీ అదానీని, దేశ సంపదను దోచుకుంటున్న వారిని అప్పుడెవరు రక్షిస్తారు అని నిలదీశారు.






