Jaggareddy: నెహ్రూ, గాంధీ కుటుంబాలపై మోడీ కుట్ర: జగ్గారెడ్డి

by Prasad Jukanti |

మోడీది స్వార్థం అయితే నెహ్రూది నిస్వార్థం అని జగ్గారెడ్డి అన్నారు.

Jaggareddy: నెహ్రూ, గాంధీ కుటుంబాలపై మోడీ కుట్ర: జగ్గారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెహ్రూ, గాంధీ కుటుంబాల త్యాగాలపై ప్రధాని నరేద్ర మోడీ, బీజేపీ విషపూరిత కుట్రలు చేస్తున్నారని మాజీ కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. స్వాతంత్య్ర ఉద్యమంలో మోడీ (Narendra Modi), బీజేపీ కాంట్రిబ్యూషన్ ఏముందని ప్రశ్నించారు. దేశ రాజకీయాల్లో నెహ్రూ (Nehru), గాంధీ (Gandhi) కుటుంబాల ఉనికి ఉండొద్దనే ఏకైక ఎజెండాతో బీజేపీ పని చేస్తోందని అందువల్లే నిన్న సోనియా గాంధీ ఈ విషయాన్ని సోనియా గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు. ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసుకోవడం మంచి సంప్రదాయం కాదని ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. గాంధీ, నెహ్రూ చేసిన త్యాగాలు నేటి యువతరం తెలుసుకోవాలన్నారు. నెహ్రూ, గాంధీలపై మోడీ ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా వారిది ఎప్పటికీ చరిత్ర అన్నారు. స్వాతంత్య్రానికి ముందు ఈ దేశంలో రాజకీయాలు లేవని, మోడీ తాను ప్రధాని అయ్యేందుకే పని చేస్తే నెహ్రూ అలా కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం కోసం పని చేశారన్నారు. మోడీది స్వార్థం అయితే నెహ్రూది నిస్వార్థం అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచనలను మా భుజాన మోస్తామన్నారు.

Next Story