హైడ్రాలో బీఆర్ఎస్ కోవర్టులు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

హైడ్రా(Hydraa) అధికారులపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైడ్రాలో బీఆర్ఎస్ కోవర్టులు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(Hydraa) అధికారులపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు హైడ్రా అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే కుట్రలో భాగంగా ఓవరాక్షన్ చేస్తున్నారని అన్నారు. వారి ప్రవర్తన బీఆర్ఎస్‌కు లాభం చేకూరేలా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి అధికారులపై హైడ్రా చీఫ్ రంగనాథ్(Ranganath) దృష్టి పెట్టాలని సూచించారు. కేటీఆర్ కూడా హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. దీనిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత అధికారులపై కూడా ఉందని అన్నారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే కేటీఆర్‌కు హైడ్రా గుర్తుకు వస్తోందని జగ్గారెడ్డి విమర్శలు చేశారు. ఇన్ని రోజులు హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అనుకూల హైడ్రా అధికారుల వల్ల ఎవరైనా నష్టపోతే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్తాని అన్నారు. హైడ్రా అంశం తెరపైకి తెచ్చి జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story