‘కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ దమ్మున్నోళ్లే’.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లే కారణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు.

‘కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ దమ్మున్నోళ్లే’.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లే కారణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీ అడుగు జాడల్లో నడుస్తోందని, ఓట్ల చోరీపై ఈసీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీకి దేశం మొత్తం మద్దతివ్వాలన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలపై విచారణ చేయడం లేదని ఈసీని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం మీద బీజేపీది కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు.

ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల ద్వారా దొంగ ఓట్లు తయారు చేశారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండకూడదు అనేది బీజేపీ కుట్ర అని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎవ్వరూ ఊహించని విధంగా మూడోసారి మోడీ ప్రధాని అయ్యాక పలు అనుమానాలు వచ్చాయని, ఆయన ప్రధాని కావడానికి కారణమైన నలభైకి పైగా ఎంపీల ఓట్లు బోగస్ అని అనుమానాలున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. తమ ఆరోపణలు నిజమా అబద్ధమా చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దన్నారు. భద్రతగా భావించే ఎలక్షన్ కమిషన్ తప్పు దారి పట్టిందని, మారు మూల గ్రామాల్లో, కనిపించని ప్రాంతాల్లో దొంగ ఓట్లను నమోదు చేయించి గెలిచేందుకు ప్రణాళిక వేశారన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం మీద బీజేపీది కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ స్క్రిప్ట్ చదవాలి కావున ఆ పనే చేశారని, ఆయన బీజేపీ లీడరా లేక ఎన్నికల కమిషనరా అర్ధం కాలేదని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. పురంధేశ్వరి ఎన్టీఆర్ కూతురైనా బీజేపీ స్క్రిప్టు చదవాల్సిందే అని ఆయన విమర్శించారు. తమ కాంగ్రెస్‌లో అందరూ దమ్మున్నోళ్ళమే అని, కోమటిరెడ్డి సోదరులు దమ్మున్న వాళ్ళే అని జగ్గారెడ్డి అన్నారు.

Next Story