- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ఎమ్మెల్సీ అడగట్లేదు.. ట్రైన్‌లో ఢిల్లీకి జగ్గారెడ్డి.. ఎందుకు?
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నేత జగ్గారెడ్డి ఇవాళ(గురువారం) ఢిల్లీకి పయనం అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy) ఇవాళ(గురువారం) ఢిల్లీకి పయనం అయ్యారు. ట్రైన్‌లో ఢిల్లీకి వెళ్తున్న వీడియోను తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ప్రకటన చేశారు. మీడియా మిత్రులకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా.. నేను ఎమ్మెల్సీ అడగట్లేదు.. అడగను కూడా అని స్పష్టం చేశారు. నాకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చింది.. పోటీ చేసిన. పరిస్థితులు అనుకూలించక ఓడిపోయిన, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు. (MLA Quota MLC election) ఎమ్మెల్సీ పదవి కావాలని పడీ పడీ అడిగే గుణం తనది కాదన్నారు. ఈ విషయంలో మీడియా మిత్రులు ఎవరు కూడా ఎమ్మెల్సీ విషయంలో ఊహాగానాల వార్తలు రాయోద్దని సూచించారు.
2017 లో కాంగ్రెస్ అగ్రనేత (Rahul Gandhi) రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల మీద స్పష్టంగా వారి దృష్టికి తీసుకెళ్లాలని గత ఆరు నెలల నుంచి డిల్లీకి వెళ్లి రాహుల్‌కి చెప్పాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సభ ఆర్గనైజేషన్, ఎలాంటి పరిస్థితుల్లో సభ ఏర్పాట్లు చేశానో.. ఆ విషయాలు రాహుల్‌కి స్వయంగా చెప్పాలని డిల్లీకి వెళ్తున్నట్లు వెల్లడించారు. డిల్లీకి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికితే వారితో మాట్లాడుతానని స్పష్టం చేశారు.






