నడిరోడ్డులో బట్టలు విప్పి గుంజీలు తీయిస్తా.. MP ఈటల‌కు జగ్గారెడ్డి హెచ్చరిక

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మళ్ళీ ఇంకోసారి లూజ్ కామెంట్స్ చేస్తే నడిరోడ్డులో బట్టలు విప్పి గుంజీలు తీయిస్తానని ఈటల రాజేందర్‌(Etala Rajender)కు టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​జగ్గారెడ్డి(Jaggareddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

నడిరోడ్డులో బట్టలు విప్పి గుంజీలు తీయిస్తా.. MP ఈటల‌కు జగ్గారెడ్డి హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మళ్ళీ ఇంకోసారి లూజ్ కామెంట్స్ చేస్తే నడిరోడ్డులో బట్టలు విప్పి గుంజీలు తీయిస్తానని ఈటల రాజేందర్‌(Etala Rajender)కు టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​జగ్గారెడ్డి(Jaggareddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈటల రాజేందర్ ఇప్పటికైనా నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలని సూచించారు. లిమిట్స్ దాటి నువ్వు మాట్లాడావు.. అందుకే నేను లిమిట్స్ దాటి సమాధానం ఇస్తున్నానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్‌పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఒక్కరోజు కూడా ఈటల మాట్లాడలేదని అన్నారు. బీజేపీలో కోరుకున్న పదవులు రాకపోయేసరికి గంజాయి తాగిన వాడి లెక్క.. ఓ సైకో లాగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. బూతులు మాట్లాడేవారికి బూతులతోనే సమాధానం చెబుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పదవి రాలేదని ప్రస్టేషన్‌లో ఈటల మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. నిన్ను చూసి జాలిపడి సీఎం రేవంత్ రెడ్డి వదిలేస్తున్నాడేమో కానీ.. మేము అలా వదిలేయమని హెచ్చరించారు.

Next Story