- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగ ఓట్లను తొలగించకుండా ఉల్టా మాపైనే కేసులా: ఈసీపై జగ్గారెడ్డి మళ్లీ సీరియస్
ఎన్నికల సంఘం నోటీసులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సంఘం(Telangana Election Commission) నోటీసులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి(Jagga Reddy) స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ దొంగ ఓట్లపై ప్రశ్నించా. ఒక వార్డులో 300లకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్లను ఈసీ ఎందుకు తొలగించలేదు. దొంగ ఓట్లను తొలగించకుండా.. ప్రశ్నించినందుకు ఉల్టా మాపైనే కేసులు పెడుతున్నారు. దొంగ ఓట్లను తొలగించడంలో ఎన్నికల సంఘం విఫలం అయింది’ అని జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సీఐ.. 34 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గల్ల పట్టుకున్నారని.. ఆ సీఐని సస్పెండ్ చేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు సీఐ సహకరిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. దీంతో సంగారెడ్డిలో జరిగిన సంఘటనపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఈసీ ఆదేశించింది. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది? పోలీసుల ప్రవర్తన ఎలా ఉంది? అనే అంశాలపై విచారణ చేపట్టాలని సూచించింది. అక్కడ ఎలాంటి గొడవలు కలగకుండా అదనపు బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేసింది.






