జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం సీరియస్.. కేసు నమోదు చేయాలని SPకి ఆదేశం

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-11 14:39:35  IST  )

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై స్టేట్ ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది.

జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం సీరియస్.. కేసు నమోదు చేయాలని SPకి ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy)పై స్టేట్ ఎన్నికల కమిషన్(Telangana Election Commission) సీరియస్ అయింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీకి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.

అసలేం జరిగిందంటే..?

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డు ఇందిరా కాలనీలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సీసీఎస్‌ సీఐ శివకుమార్, స్థానిక కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సీఐ కాంగ్రెస్ నేత కాలర్ పట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసి జగ్గారెడ్డి రంగప్రవేశం చేశారు. జగ్గారెడ్డి తన కార్యకర్తను ఆపుతారా..? అంటూ ఆగ్రహానికి లోనయ్యారు. సీఐ శివకుమార్, హోంగార్డు చెన్నయ్యపై బూతులతో రెచ్చిపోయారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే జగ్గారెడ్డిపై అధికారులు కేసు నమోదు చేసి రిపోర్టు చేయాలని స్థానిక ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది.

దొంగ ఓట్లను తొలగించకుండా ఉల్టా మాపైనే కేసులా..ఈసీపై జగ్గారెడ్డి మళ్లీ సీరియస్

Next Story