Jagga Reddy: దండుపాళ్యం నాయకుడు కేటీఆర్.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2024-10-22 08:21:57  IST  )

రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (KTR), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

Jagga Reddy: దండుపాళ్యం నాయకుడు కేటీఆర్.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (KTR), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy), కేటీఆర్‌ (KTR)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ దండుపాళ్యం నాయకుడని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కూడా దండుపాళ్యం బ్యాచ్‌లాగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి సీఎం స్థాయికి వచ్చిన నాయకుడని గుర్తు చేశారు. కింది స్థాయి ప్రజల బాధలు పూర్తిగా ఆయనకు తెలుసని జగ్గారెడ్డి అన్నారు.

ఒకవేళ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తిట్ల దండకం అందుకుంటే కేటీఆర్ (KTR) తట్టుకోలేడని కామెంట్ చేశారు. కేటీఆర్ (KTR) ఓ నాజూకు లీడరని ఎద్దేవా చేశారు.. ఆయన తండ్రి కేసీఆర్‌కు బాధలంటే ఏమిటో తెలుసని.. సుధీర్ఘంగా రాజకీయాల్లో ఉండి ఎన్నో ఎదురుదెబ్బలు తిని ఉన్నత స్థాయికి వచ్చారని గుర్తు చేశారు. దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్ట్‌ (Navi Radar Project)పై కేటీఆర్‌వి పిల్ల చేష్టలని ధ్వజమెత్తారు. ఆయనకు ఓ కనీస రాజకీయ అవగాహన లేదని జగ్గారెడ్డి మండిపడ్డారు.

Next Story