జగన్ బుల్లెట్ ఎక్కిన కేసీఆర్.. నెట్టింట వీడియో వైరల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-29 16:13:10  IST  )

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ AI వీడియోను క్రియేట్ చేశారు.

జగన్ బుల్లెట్ ఎక్కిన కేసీఆర్.. నెట్టింట వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్ర‌స్తుతం ఏఐ యుగం న‌డుస్తోంది. ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్ తో చాలా ప‌నులు సుల‌భంగా చేసేస్తున్నారు. ముఖ్యంగా కోడింగ్, వీడియో ఫోటోల ఎడిటింగ్ కోసం ఏఐ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది. దీంతో వీటి కోసం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ఏఐ వీడియోలు అయితే సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తమకు నచ్చిన సినిమా తారలు, క్రికెటర్లతో పాటు రాజకీయనాయకుల వీడియోలను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వీడియోను సైతం క్రియేట్ చేశారు.

వీడియోలో జగన్, కేసీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇద్దరూ తెల్లని దుస్తులు ధరించి స్పెడ్స్ పెట్టుకున్నారు. ఇక జగన్ బుల్లెట్ బైక్ నడుపుతుంటే వెనకాల కేసీఆర్ కూర్చుని ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఇద్దరు మాజీ సీఎంల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. రెండు పార్టీల సోషల్ మీడియాలు ఒకదానికి మరొకటి సపోర్ట్ చేసుకుంటూ అధికారంలో ఉన్న పార్టీలపై విమర్శలు చేస్తుంటాయి. దీంతో కేసీఆర్, జగన్ అభిమానులను వీడియోను తెగ లైక్ చేస్తున్నారు.

Next Story