Jagadish Reddy: కోమటిరెడ్డి – ఉత్తమ్ ఇద్దరూ అసమర్థులే

by Gantepaka Srikanth |

మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Jagadish Reddy: కోమటిరెడ్డి – ఉత్తమ్ ఇద్దరూ అసమర్థులే
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఫామ్‌‌హౌజ్‌లో క్షుద్రపూజలు అంటూ కోమటిరెడ్డి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. నాగార్జునసాగర్ నుంచి వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా వీరు పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు.

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదని చెప్పారు. దీనిపై జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వరుసగా ఎనిమిదేళ్లు చెరువులు నిండుగా ఉంచి.. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చామని తెలిపారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి మంత్రులు అయ్యాక మళ్లీ పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు. హెలికాఫ్టర్ల ఆర్భాటాలు.. కమీషన్ దందాలు తప్ప రైతుల పట్ల ఇద్దరికీ ప్రేమ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నీటిని ఆంధ్రాకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కోమటిరెడ్డి – ఉత్తమ్ ఇద్దరూ అసమర్థులు కాబట్టి ఇదంతా జరుగుతోందని అన్నారు. అంతేకాదు.. నల్గొండలోని R&B గెస్ట్ హౌస్‌ను మంత్రి సొంత క్యాంపు ఆఫీస్‌గా మార్చడం అధికార దుర్వినియోగమని వెల్లడించారు.

Next Story