- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jagadish Reddy: జూబ్లీహిల్స్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) గెలుపు కోసం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) గెలుపు కోసం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. జూబ్లీహిల్స్(Jubilee Hills By Election) అభివృద్ధిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి చర్చకు ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రుల్లో ఎవరు వచ్చినా సిద్ధమని సవాల్ చేశారు. జూబ్లీహిల్స్‌లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే దొంగ ఓట్లు సృష్టించారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి తప్పుచేశామని ఒకవైపు ప్రజలు బాధపడుతుంటే.. మరోవైపు స్వయంగా మంత్రులే కాంగ్రెస్ బాగోతాన్ని బయటపెడుతున్నారని విమర్శించారు. ఇక రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి కనిపించట్లేదు.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే.. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నుంచే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ప్రారంభం కావాలని కోరారు.






