డ్రైనేజీలో వందల బ్యాలెట్‌పేపర్ల దర్శనం.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

by Ajay Maddhiboyina |

న‌ల్గొండ జిల్లా చిట్యాల మండ‌లం చిన్న‌కాప‌ర్తి గ్రామంలో ఓ డ్రైనేజీ కాల్వ‌లో బ్యాలెట్ పేప‌ర్లు ద‌ర్శ‌నం ఇచ్చాయి. మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి పోలీసుల‌కు,

డ్రైనేజీలో వందల బ్యాలెట్‌పేపర్ల దర్శనం.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: న‌ల్గొండ జిల్లా చిట్యాల మండ‌లం చిన్న‌కాప‌ర్తి గ్రామంలో ఓ డ్రైనేజీ కాల్వ‌లో బ్యాలెట్ పేప‌ర్లు ద‌ర్శ‌నం ఇచ్చాయి. మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి పోలీసుల‌కు, ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌గా ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. పేప‌ర్ల‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చిన వ్య‌క్తిపై 233 సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేశారు. స్టేజ్ టూ ఆర్వోను జిల్లా క‌లెక్ట‌ర్ త్రిపాఠి స‌స్పెండ్ చేశారు. ఘ‌ట‌న‌పై విచారించేందుకు న‌ల్గొండ ఆర్డీవోను అధికారిగా నియ‌మించారు.

మిగిలిన బ్యాలెట్ ప‌త్రాల‌ను ఆర్డీవో స‌మ‌క్షంలో భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని, వీడియో గ్ర‌ఫీ చేయించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఘ‌ట‌న‌పై జ‌గ‌దీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. బ్యాలెట్ పేప‌ర్లు త‌మ అభ్య‌ర్థికి సంబంధించిన‌వే అని అన్నారు. బీఆర్ఎస్ అభ్య‌ర్థి ఓట్లు చింపేసిన‌ట్టు, త‌గ‌ల‌బెట్టిన‌ట్టు, కాల్వ‌లో ప‌డేసిన‌ట్టు క‌నిపిస్తున్నాయ‌ని అన్నారు. కాంగ్రెస్ ది బ్యాలెట్ చోరీ అని ఆరోపించారు. గెలుపోట‌ములు తారుమారు చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తుంద‌ని అన్నారు. చివ‌రికి ఎన్నిక‌ల సంఘాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నార‌ని ఆరోపించారు.

Next Story