- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజగోపాల్ రెడ్డి మాటలన్నీ ఉత్తవే: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వాళ్లవి అన్ని బ్లాక్ మెయిల్ స్టేట్ మెంట్లే ఉంటాయన్నారు. ఒక మాట అని వెంటనే కాంప్రమైజ్ అవుతారని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని కొనుక్కున్నారని వాళ్లిద్దరే అన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయను అని రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయాడని మళ్లీ అదే పార్టీలోకి వెళ్లాడని విమర్శించారు.
పెద్ద మొనగాళ్లం అని చెప్పుకుంటారని రాజగోపాల్ రెడ్డి మాటలన్నీ ఉత్తవే అని నమ్మితే అమాయకత్వమే అని అన్నారు. రాజగోపాల్ రెడ్డి మాటలు నమ్మితే వాళ్లు అమాయకులే అని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డికి అంత దమ్మే ఉంటే ఆయనతో పార్టీలో నుండి బయటకు వచ్చే నేతలను కూడగట్టాలని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలను ఖండించేవాళ్లు ఎంతమందో తనతో కలిసి రావాలని చెప్పాలన్నారు. కానీ వాళ్ల వెంట ఎవరూ రారని, ఎందుకంటే వాళ్లే మాటపై నిలబడరని ఎద్దేవా చేశారు.






